Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆగస్టు 31న తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – రాష్ట్రంలో మహిళలపట్ల ఎటువంటి దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకుగాను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆదేశాలతో ‘శక్తి టీమ్స్’ను జిల్లాలో ఏర్పాటు చేసామన్నారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్ళును మఫ్టీలో సందర్శించి, మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి మరియు రాజాం పట్టణాలలో ఆరుగురు పోలీసు సిబ్బందితో ఐదు బృందాలుగా 30మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామని, ఒక్కొక్క బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తున్నారన్నారు. ఈ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తారని జిల్లా తెలిపారు. శక్తి ఎస్.ఓ.ఎస్.కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై సకాలంలో సంఘటనా స్థలంకు చేరుకొని సమస్యలను చట్టబద్దంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడంతోపాటు, మహిళల మొబైల్స్ ఫోన్లలో శక్తి (ఎస్.ఓ.ఎస్) యాప్ను నిక్షిప్తం చేయడం, రిజిస్ట్రేషను చేయిస్తున్నామన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏవిధంగా పని చేస్తుందన్న విషయాన్ని మహిళలకు వివరిస్తున్నామన్నారు. ఈ బృందాల పని తీరును అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, దిశా నిర్ధేశం చేస్తున్నారన్నారు. ఈ బృందాలు స్కూల్స్, కళాశాలలను సందర్శించి విద్యార్ధినులు, ఉపాధ్యాయులతో శక్తి వారియర్స్ కొన్ని బృందాలను నియమిస్తున్నామన్నారు. ఈ బృందాల్లో యాక్టివ్గా ఉండే విద్యార్ధినులను లీడ్ వారియర్ గా నియమిస్తున్నా మన్నారు. అంతేకాకుండా, విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెంపొందించి, ఆపద సమయంలో తమను తాము రక్షించు కొనేందుకు సెల్ఫ్ డిఫెన్సు టెక్నిక్స్ ను కూడా కళాశాలలు, పాఠశాలలో నేర్పిస్తున్నామన్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా మహిళా ట్రైనర్ను నియమించి, పిఈటిలకు కొన్ని మెళుకువలను నేర్పించి, వారి సహకారంతో విద్యార్ధినులు చైతన్యపరుస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.