Listen to this article

జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

పట్టణంలోని కంటోన్మెంట్కు చెందిన ఎఫ్ సి డెన్ సంస్థ ఆద్వర్యంలో ఆదివారం ఉదయం 5కె రన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 5.30గంటలకు ప్రారంభించిన ఈరన్ కు యువకులుతోపాటు అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ5కె రన్లో పురుషులు, మహిళల విభాగాలను ఏర్పాటుచేసి విజేతలకు బహుమతులను అందజేసారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ప్రముఖటీడీపీనేత అనురాధబేగంను, రాష్ట్ర హెూటల్ అసోషియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావులు హాజరై విజేతలకు బహుమతులను అందజేసారు. ఈనందర్భంగా ఎఫ్ సి డెన్స్ నిర్వాహకులు, సిఇవో బి. రమ్య మాట్లాడుతూ 108 రోజులపాటు వివిద రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని, అందులో భాగంగా మొదటిగా 5కె రన్ నిర్వహించామన్నారు. ఈకార్యక్రమానికి హెల్త్ పార్టనర్ గా క్వీన్స్ ఎన్ఆర్ ఐ, ఈవెంట్ పార్టనర్ గా చేతన్ గాస్ట్రో హాస్పటల్ సహకారం అందించారన్నారు. 5కె రన్లో పాల్గొన్న వారికి ఎఫ్ సి డెన్స్ సంస్థ భోజన కూపన్లును అందజేసిందన్నారు. అలాగే కార్యక్రమంలో ప్రముఖ ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లున్సర్ హారిక పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ దన్యవాదాలు తెలిపారు.