

జనం న్యూస్ 01 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో కళాకారులకు, కళాభిమానులను అత్యంత ఇష్టస్టాన ఆనంద గజపతి కళాక్షేత్రం కళావిహీనంగా ఉందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజును ఆదివారం కలిసి కఠళాక్షేత్రం ఆధునీకరించి అతి తక్కువ ఖరీదుతో ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. తాట్రాజు రాజారావు, ఈశ్వరప్రసాద్, రామ్మోహన్ రావు పాల్గొన్నారు.