

జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు.
వికారాబాద్ జిల్లా పూడూర్ పరిధిలోని గట్టుపల్లిలో ప్రతిష్టించిన వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆదివారం ఐదు రోజులు కావడంతో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు ప్రజలు పాల్గొన్నారు.