Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి

కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసియున్న వరసిద్ధి వినాయకునికి మండప బ్రహ్మ పెద్దింటి వ్యాసమూర్తి శర్మ (తంబి ) బ్రహ్మత్వంలో ప్రముఖ వ్యాపారస్తులు” గ్రంధి “వారి కుటుంబ సభ్యులచే విశేషమైన అభిషేకాలు, సహస్ర గరిక, వివిధ రకాల పుష్పాలచే పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. భాజపా జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ దంపతులు, గ్రంధి సురేష్ దంపతులు వారి కుటుంబ సభ్యులచే స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధి శివరావు, గ్రంధి నాగేశ్వరరావు, నాగబాబు, ఆశపు సూరిబాబు లతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రేపు అనగా మంగళవారం స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం శివ ఆయిల్ ఏజెన్సీస్ వారి ధన సహాయంతో జరుగుతుందని శనివారం స్వామివారి లడ్డూల వేలంపాట, అనంతరం స్వామివారి ఊరేగింపు, నిమజ్జనా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు…