

జనం న్యూస్- సెప్టెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం నుండి శుక్ర వారం వరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణమాచార్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం మొదటి రోజు విష్యక్సేన పూజ, అఖండ స్థాపన, బుధవారం హోమ నిర్వహణ, 360 రకాల నైవిద్యాలతో సమర్పణ, గురువారం పవిత్రాధివాసం, పవిత్రారోపణ శుక్రవారం పూర్ణాహుతి, లక్ష్మీ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అర్చకుల, ధర్మకర్తల లోపములు, ఆరాధన, నైవేద్యముల లోప నివారణను పవిత్రం చేకూర్చే ఉత్సవమే పవిత్రోత్సవం అని వారు తెలిపారు. దేవాలయాలలో అరుదుగా నిర్వహించే ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలకి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.