Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా నిరసన తెలిపారు మండల కేంద్రంలోని చౌరస్తా బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి, నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇలాంటి మహానేతపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసే విమర్శలు, వ్యక్తిగత దూషణలు తీవ్రంగా ఖండిస్తున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య పరిమితులను దాటి, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే మేము సహించము.” అని మండిపడ్డారు.ప్రధానమంత్రి గౌరవాన్ని కాపాడే దిశగా, బీజేపీ ఉద్యమం కొనసాగుతుంది.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు,మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, పోల్ మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి,మండల కార్యదర్శిలు మేకల సుమన్, జొన్నొత్తుల జీవన్ రెడ్డి, భూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, బాసని నవీన్, ముల్కనూరి వెంకటేష్,గొండ శ్రీనివాస్, నాతి విద్యాసాగర్, పున్నం సాంబయ్య, ఎర్ర తిరుపతిరెడ్డి, కొంగరి సుధాకర్, కన్నెబోయిన రమేష్,రాజోజు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు…..