

జనం న్యూస్ సెప్టెంబర్ 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
అకాల వర్షం కురిసి విపత్కర పరిస్థితి ఏర్పడి రైతులు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు లేని ఘోష ఈసారి రైతులకు పంట నష్టాలతో చూడడం జరుగుతుంది ఇళ్ల పరిస్థితి గానీ పంటల పరిస్థితి గానీ రోడ్ల పరిస్థితి గానీ గోరంగా మారడం జరిగింది. ఇలా జరగడం చాలా బాధాకరం పంట నష్టపోయిన రైతులందరికీ అండగా ఉంటామని ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని నష్టపరిహారం ఎకరానికి 40 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు రూమ్ లో మంజూరు చేయాలని కోరారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఈ పరిస్థితిని పరిశీలించడం కోసం మున్నూరు కాపు రైతుబిడ్డలను కర్షకులను పరామర్శించడం కోసం తెలంగాణ రాష్ట్ర అపెక్స్ కమిటీ మెంబర్ మామిళ్ళ అంజయ్య రావడం జరిగింది. లింగంపేట మండల కమిటీని లింగంపల్లి లింగంపేట ఐలాపూర్ వివిధ గ్రామ రైతులను కలిసి వారిని ఓదార్చి సానుభూతి తెలపడం కోసం రావడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని మున్నూరు కాపు మండల అధ్యక్షుడు గుండా బాలకిషన్, ప్రధాన కార్యదర్శి పోకల చిన్న మల్లయ్య, జిల్లా రైతు నాయకుడు పెద్దోళ్ల పోచయ్య, మండల ఉపాధ్యక్షుడు గాలం అంజయ్య, అనుమల రఘుపతి, అనుమండ్ల రాములు, మండల కోఆర్డినేటర్ అనుమండ్ల రవీందర్, కొత్త పోచయ్య, మేకల రాములు, గాలే మంజయ్య, లింగు రాజయ్య, వివిధ గ్రామ మున్నూరు కాపు నాయకులు వివిధ గ్రామల రైతులు తదితరులు పాల్గొన్నారు.
గుండబాల కిషన్ పటేల్,లింగంపేట మండల మున్నూరు కాపు అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి పోకల చిన్న మల్లయ్య,లు పాల్గొన్నారు