

బెంగళూరు: దోసకాయ విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి ఏకంగా సొంత చెల్లెలినే దారుణంగా హత్య చేసిన సంఘటన చామరాజనగర్(Chamarajanagar) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొళ్ళేగాల ఈద్గా మొహల్లా వీధిలో నివసించే సయ్యద్ పాషా(Sayed Pasha) ఇంట్లో బుధవారం రాత్రి దారుణం జరిగింది. రాత్రి భోజనం వేళ చెల్లెలు ఇమాన్‌భాను అన్న కుమారుడికి దోసకాయ తినిపించేందుకు ప్రయత్నించారు.