Listen to this article

పాపన్నపేట,సెప్టెంబర్01 (జనంన్యూస్):

ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ న్నారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం చెరువులు,కంటలు నిండుగా ఉన్నందునా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలను చెరువులు,కుంటలు వద్దకు తీసుకువెళ్లవద్దన్నారు.నిమజ్జనం చేసే సమయంలో చెరువులు,కుంటల్లో లోతుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దన్నారు.కండీషన్ లో ఉన్న వాహనాలను మాత్రమే నిమర్జనాలకు వినియోగించాలన్నారు. అనుభవజ్ఞులైన,లైసెన్స్ పొందిన డ్రైవర్లతో వాహనం నడిపించాలని సూచించారు. డీజే సౌండ్లకు అనుమతి లేదన్నారు.నిబంధనలు పాటిస్తూ చీకటి పడేలోపు ప్రశాంతంగా గణేష్ శోభాయాత్ర,నిమర్జనం నిర్వహించాలన్నారు.