

పార్టీ బలోపేతానికి కృషిచేస్తా.
స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అధ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తా.
జూలూరుపాడు,జనం న్యూస్ (సెప్టెంబర్01):
బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల ప్రజల్లోకి మరింత విస్తృతంగా పార్టీని తీసుకెళ్లేందుకు, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగించి రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో ఉంచుతానని అందుకోసం శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు, అదేవిధంగా మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సమన్వయంతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.