Listen to this article

జనం న్యూస్,సెప్టెంబర్01,అచ్యుతాపురం:

పూడిమడక గ్రామంలో డ్వాక్రా విఏఓగా ఎరిపల్లి కోదండమ్మ అనే యువతీ పని చేస్తున్నందున ఆమె
వద్ద అనేక మంది వివాహితుల ఫోన్ నెంబర్లు ఉండటంతో ఆమె వివాహం అయిన వారిని విడగొట్టి మరొక వ్యక్తిని అంటగట్టి వారి నుండి అధిక మొత్తం సొమ్ము అక్రమంగా సంపాదిస్తూ ఎందరో అమాయక
ప్రజల కుటుంబాలతో చెలగాటమాడుతుందని, ఇది వరకే అనేక సార్లు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వారిని మోసగించి అన్యాయంగా వారి నుండి డబ్బులు కాజేసిందని, ప్రశ్నిస్తున్న వారిపై అక్రమంగా కేసులు పెట్టి భయాళోందనకు గురిచేస్తుందని ఆమె పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మేరుగు నూకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులతో కలిసి ఈరోజు పీజీఆర్ఎస్ లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా ఎస్పీకి చేసిన పిర్యాదు చేయడం జరిగింది అని నూకమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వై. అరుణ,మంగ,దేవి,నూకరాజు తదితరులు పాల్గొన్నారు.