

అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ నేతలు ధర్నా
జనం న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రధానికి ఆయా దేశ అధ్యక్షులు ప్రజలు నీరాజనం పడుతుంటే రాహుల్ గాంధీ మోడీ తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారని, తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారని అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారింది అన్నారు. రాహుల్ గాంధీ వెంటనే మోడీకి, ఆయన తల్లికి బహిరంగ క్షమాపణలు చెప్పక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, అయినవిల్లి మండలం అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మహిళా మోర్చా రాష్ట్ర సెక్రటరీ ఆకుమర్తి బేబీరాణి, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ మోకా ఆదిలక్ష్మి, యువమోర్చ రాష్ట్ర సెక్రటరీ కాలాబత్తుల చిన్నారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాటం అమ్మాజి, అల్లాడి మరియమ్మ, కె.దుర్గ, వరదా మరియమ్మ, అమలాపురం పట్టణ ఉపాధ్యక్షులు కె.వెంకట్, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, కె.నారాయణ మూర్తి, ఎ.భాస్కర్ రావు, వై.శకుంతల, వరదా క్రిష్ణారావు, అల్లవరం మండల అధ్యక్షులు నారాయణ మూర్తి పాల్గొన్నారు.
