

జనంన్యూస్. 01.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన మార్గం కొండూరు వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో ప్రత్యామ్నాయంగా పెద్దవాల్గొట్ నుండి నుండి చిన్న వాల్గొట్ బ్రిడ్జి వరకు మొరం పనులు ప్రారంభమైనావి అధికారులతోని మాట్లాడి తొందరగా పని చేపించినందుకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారు అలాగే ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాకారం రవి. గొల్ల ఎర్రన్న. వాల్గోట్ గంగారెడ్డి. చిన్నవాల్గొట్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.