Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఐ పోలవరం మండలం, గుత్తెనదీవి లో చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖ్ శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో దృష్టిపెట్టే లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణ గతివిధి ముఖ్యంగా మూడు పనులను చేస్తుంది. మొదటిది చెట్లు, వృక్షాలను నాటడం అవి పెరిగేదాకా రక్షణ చేయాలి. రెండవది నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడవలెను. మూడవది సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ విషయాలను బాగా ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టుకు రాఖీ కట్టి తన వంతుగా దాన్ని రక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడిశెట్టి రమేష్, రెళ్ళు గంగాధరం, సలాది శ్రీనివాసరావు,చప్పిడి బోస్, గుత్తుల మూర్తి, గాలి దేవర దుర్గారావు, ఎమ్. కుమార్ తదితరులు పాల్గొన్నారు.