Listen to this article

బండి సంజయ్ సూచన మేరకు ఘనంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం.

జనం న్యూస్ సెప్టెంబర్ 1 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఎల్కతుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థనీ విద్యార్దులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచన మేరకు ఎల్కతుర్తి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సులభంగా పాఠశాలకు వెళ్లేందుకు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని బండి సంజయ్ చేపట్టారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 20,000 మంది పదవతరగతి విద్యార్థులకు సైకిళ్లు అందజేయనున్న ప్రణాళికలో భాగంగా ఎల్కతుర్తి మండల విద్యార్థులు ఈరోజు లబ్ధి పొందారు చదువులో ఎవరూ ఆగిపోకూడదు. ఈ సందర్భంగా మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు కూడా చదువులో ఆగిపోకూడదు అనే ఉద్దేశ్యంతోనే ఈ సైకిళ్ల పంపిణీ చేపట్టాం అని పేద కుటుంబాల విద్యార్థులు ప్రయాణ సౌకర్యం పొందుతారు మంచి విద్య నేర్చుకుని భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
సైకిల్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎల్కతుర్తి మండల MPDO విజయ్ కుమార్ గారు.ఎల్కతుర్తి మండల MEO సత్యనారాయణ గారు. ZPHS ప్రిన్సిపాల్ దుర్గ భవాని గారు. PMSHRI TSMS ప్రిన్సిపాల్ గారు.స్కూల్ ఛైర్మెన్ ఆమేనా గారు పాల్గున్నారు.వీరితోపాటు అనుమకొండ జిల్లా కౌన్సిల్ కొడతాడు చిరంజీవి సీనియర్ నాయకులు జనగానికిష్టయ్య పెరుగు మధు మధుకర్ రావు దేవేందర్ రెడ్డి అల్లి కుమార్. శ్యామల సురేష్ రెడ్డి ముప్పు రమేష్ కొడం రమేష్ ఉడత సూర్యనారాయణ బూర్గుల రామారావు విద్యాసాగర్ రమణాచారి సాంబ శివారెడ్డి పూలు కోటేశ్వర్ పోలు శివసేన వేల్పుల శ్రీనివాస్ ఠాకూర్ సామ్సంగ్ అంబిర్ శ్రీనివాస్ కామెడీ లచ్చిరెడ్డి ఎడ్ల చిలుకూరి రమేష్ మంత్రి తిరుపతి యాదవ్ కరట్లపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు