

జనంన్యూస్. 02.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండలంలోని జగదాంబ తండా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు 30 రేషన్ కార్డులను పంపిణీ చేశారు . కొత్త రేషన్ కార్డులు అందుకున్న లబ్దిదారులు ముఖ్యమంత్రి కి, ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు రవి నాయక్, గంగాధర్, విఠల్ నాయక్, మోహన్ నాయక్,మహిపాల్, సుదర్శన్, మోజ్య నాయక్, లాల్సింగ్,రమేష్, పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ పాల్గొన్నారు