Listen to this article

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ధ్వజం.

జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకి జగనన్న కోలనీలు నిర్మాణం చేసి ఇళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేదల కోలనిల్లో మౌళిక వసతులు కల్పించకుండా కుటిల రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ధ్వజమెత్తారు.సోమవారం ఉదయం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) ఆధ్వర్యంలో ఎస్. కోట నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు డేగల అప్పలరాజు నేతృత్వంలో పేదలతో కలిసి ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి డి.పి.ఓ గార్ని పంపించి పరిశీలన జరిపి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో బుగత అశోక్ మాట్లాడుతూ జామి మండల కేంద్రంలో జగనన్న కోలనీల్లో నివాసం ఉంటున్న ఇళ్ళకి కరెంటు, వీధి లైట్లు, మంచినీటి కుళాయిలు, రోడ్లు, డ్రైనేజీలు లేక పేదలు భయాందోళనతో బితుకు బితుకుమంటూ బ్రతుకు జీవుడా అని కష్టాలు అనుభవిస్తుంటే స్థానిక పాలకులకి, అధికారులకి కానరాలేద అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళు మంజూరు చేశారు, నిర్మాణం కోసం చాలీచాలని ఋణం ఇప్పించేశారు అక్కడితో పాలకుల భాధ్యత తిరిపోయినట్టేనా అని ప్రశ్నించారు. పెదలంటే కేవలం మీ దృష్టిలో కేవలం ఓటు బ్యాంకు మాత్రమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వం మొదలు పెట్టిన సంక్షేమాన్ని మరొక ప్రభుత్వం చేతుల్లోకి అధికారం బదలాయింపు జరిగితే వారు మొదలు పెట్టిన సంక్షేమాన్ని గాలికొదిలేస్తారా అని విమర్శించారు. కోలనీలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుని ఏదో ఘనకార్యం సాధించినట్టు పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాలనీలు ఏర్పాటు చేసిన తరువాత అందులో ప్రజలు నివాశయోగ్యంగా ఉండే విధంగా కనీస మౌళిక వసతులు కల్పించడం కోసం అవసరమైన నిధులు కేటాయించాలన్న కనీస అవగాహన పాలకులకి లేకపోవడం చాలా సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. నెయ్యిల వీధి జగనన్న కొలనిల్లో ఉన్న పేదలకి అండగా సిపిఐ నిలబడి కొలనీలో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) దశల వారీగా పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగన్నన్న కోలని పేదలు పాల్గొన్నారు.