

పాపన్నపేట, సెప్టెంబర్ 1, (జనంన్యూస్)
పాపన్నపేట లోని పాతూరు కాలనీలో హనుమాన్ ఆలయం వద్ద సోమవారం గణపతి మండపంలో అర్చకులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో వినాయక పూజ కార్యక్రమంలో దేశబోయిన దామోదర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం పుణ్యవచనం నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన,గౌరీ పూజ లో పాల్గొన్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులు గణపతి,అమ్మవారి దయ వల్ల త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నీరాజనం కార్యక్రమంలో ముఖ్యంగా గణపతి కంకణ స్వాములు,సహారా యూత్ సభ్యులు,పాతూరు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
