Listen to this article

పాపన్నపేట సెప్టెంబర్ 01 (జనంన్యూస్)

పాపన్నపేట మండలంలోని చాలా గ్రామాలు అతలాకుతలం గా మారి వేల ఎకరాల వరి పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై మండలంలోని భాజపా నాయకత్వం గౌరవనీయ ఎంపీ రఘునందన్ రావు గారికి ఈ విషయం చేరవేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎంపీ గారి ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయ. పాపన్నపేట మండలంలో ముంపునకు గురైన గ్రామాలు ఎల్లాపూర్ పొడిచిన పల్లి కొత్తపల్లి కుర్తివాడ ఆరేపల్లి పాపన్నపేట ముద్దపురం రామ్ తీర్థం మల్లంపేట కొత్త లింగయ్య పల్లి చికోడ్ కొంపల్లి నార్సింగి బాచారం కొడపాక గ్రామాలలో పరీక్షించడం జరిగింది. పంట నష్టాలను రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ మాట్లాడుతూ పంట నష్ట నివారణ చూస్తే కళ్ళకు నీళ్లు వస్తున్నాయని బాధను వ్యక్తం చేశారు రైతులు వారి యొక్క దీనగాతను చెప్పుకొ లేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అ ఇంకా భారీ వచ్చా వర్షాలు వచ్చే ప్రమాదమునందున ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేలో మెదక్ కలెక్టరేట్ కు వచ్చి పోతూ తూతూ మంత్రంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లినటువంటి విషయం రైతులను వంచించడమే అన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క పథకాలైన పసలు భీమ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసినట్లయితే రైతులకు ఆసరాగా ఉండేదని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి జాతీయ విపత్తు కింద ప్రకటించాలని కోరినటువంటి దాఖలు లేవని తెలియజేశారు ఇంత పెద్ద నష్టం నష్టం జరిగినందుకు రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తొందరగా పంట పొలాలు సర్వే చేయించి ఎకరాకి 40 వేల రూపాయలు తక్షణమే చెల్లించాలని లేనిపక్షంలో రైతులతో ప్రభుత్వ కార్యాలయం ముట్టడించి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు ఈ సర్వేలో భాగంగా గ్రామాలలో పర్యటించి తెలుసుకున్న పంట పొలాల సర్వే నంబర్లు లబ్ధిదారుల పేర్లు తో పాటు ఏఈఓ నాగరాజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అతనికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. క్షేత్ర స్థాయి పర్యటనలో జిల్లా నాయకులతో పాటు జిల్లా నాయకులు బి.కొండ రాములు మండల సీనియర్ నాయకులు శంకరన్న బీజేవైఎం నాయకులు శ్రీరామ్ నరేష్ మాజీ జనరల్ సెక్రటరీ మెట్టు దుర్గాప్రసాద్ ఓబీసీ నాయకులు నాగేష్ మండల నాయకులు దుర్గేష్ మల్లేష్ ప్రభు యేసు తోపాటు రైతులు రైతు నష్టనివారణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది