Listen to this article

జూలూరుపాడు,02సెప్టెంబర్,జనం న్యూస్:

తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం (టిఎంకేజెఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మండల పరిధి అనంతారం గ్రామానికి చెందిన ఉసికల రమేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ నియామక ఉత్తర్వులను మంగళవారం జారీ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఉసికల రమేష్ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉసికల రమేష్ జూలూరుపాడు సీనియర్స్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శిగా,తెలుగు వెలుగు రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. రమేష్ నియామకం పట్ల రాష్ట్ర మున్నూరు కాపు సంఘం జాయింట్ సెక్రెటరీ, జూలూరుపాడు సీనియర్స్ ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు, సీనియర్ జర్నలిస్ట్ బాపట్ల మురళి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు తంబర్ల పుల్లారావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, కోశాధికారి బుడెన్ పాషా తోపాటు, ప్రెస్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.