

బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో కమ్మరి చెరువులో ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమర్జనం కొనసాగేలా ఏర్పాటు చేయాలని అన్నారు నిమజ్జనం చేసే ప్రాంతంలో పిచ్చి మొక్కలు మూలకంపలను తొలగించాలని మున్సిపాలిటీ సిబ్బందికి తెలిపారు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిమర్జనం వేళల్లో ప్రతి ఒక్కరు అధికారులకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ మరియు ఎస్సై మోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం, ఇరిగేషన్ ఏ ఈ చందు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్, కాంగ్రెస్ నాయకులు బండు పటేల్ ,యోగేష్, మున్సిపాలిటీ సిబ్బంది వీరేశం తదితరులు పాల్గొన్నారు

