Listen to this article

అన్నదానంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు జైడి విజయ్ రెడ్డి

జనం న్యూస్, సెప్టెంబర్ 02, జగిత్యాల జిల్లా,

ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోని యామాపూర్ గ్రామంలో యంగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామవాసులు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యంగ్ బాయ్స్ యూత్ అధ్యక్షుడు జై డి విజయ్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల అన్ని కులాల వారు యంగ్ బాయ్స్ యూత్ సభ్యులుగా ఉంటూ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తూ యంగ్ బాయ్స్ సభ్యులు ప్రతి ఒక్క గ్రామ యువతకు మరియు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని మాకు చాలా గర్వకారంగా ఉంది. మరియు అన్న ప్రసాద్ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక అన్నదాన దాతకు మరియు యూత్ సభ్యులకు మరియు భక్తులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తో పాటు స్వామివారికి ఇరవై ఒక రకాల ప్రసాదాలను సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో మరింత వైభవంగా చేస్తామని సమాజానికి మా యూత్ ఆదర్శప్రా విజయ్ రెడ్డి తెలిపారు.