

జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి.
సిరికొండ మండలం ముషిన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు గోపాల్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి , మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్.. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న మరియు బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగనన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక , ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన తీరు.. దానికి తోడు యూరియా కొరత తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు , రైతుబంధు , రైతు బీమా, ఆరోగ్యశ్రీ ఏ పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదు ఇవన్నీ చూసి , పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనే బాగుందని , అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరికొండ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారా బోయిన శ్రీనివాస్ , యువ నాయకుడు భూషణ్ రెడ్డి , యువ నాయకులు ఆకుల తిరుమల్ , తదితరులు పాల్గొన్నారు..