

జనం న్యూస్ సెప్టెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేర్ రెడ్డి 16 వర్థంతి సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు మారపెల్లి కట్టయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకోసం ప్రవేశ పెట్టిన పథకాలను గుర్తు చేసుకుని, పథకాల రూపంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల రవిపాల్, నాగులగాని వీరన్న, రంగారెడ్డి, నర్సింహ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు…..