Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగు
సెల్ 9550978955

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో UPHC ఆశ వర్కర్స్ తో IEC campaign on హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా చిలకలూరిపేట ఏరియా హాస్పిటల్ ICTC కౌన్సిలర్ k. హనుమంత్ రావు మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, ఆశ వర్కర్స్ తో చెప్పడం జరిగింది. అదేవిధంగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017,ART మందులు, APSACS app ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతూ ,అలానే చెడు వ్యసనాలకు, డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు చెబుతూ అవగాహన చేయడం జరిగింది. నిర్వహించడం జరిగింది. MPH ఎలిజిబెత్ ఆశ వర్కర్స్ తో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు hiv టెస్టింగ్ తప్పనిసరిగా చేపించాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లొ మరియు N. విజయకుమార్ మరియు ANM,WHS,MPHC, UPHC సిబ్బంది,క్యాంపు సంస్థ మేనేజర్ k. పవన్ కళ్యాణ్ ORW Kezia పాల్గొన్నారు.