Listen to this article

స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు..

మహానేత చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు..

బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లో
స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాహిల్ సెట్ కార్ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులుల అర్పించి, . అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రజలకు ఆయన అందించిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ సేవలు మరో మారు గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలకు అండగా అనేక పథకాలు అందించారని, ముఖ్యంగా పేద ప్రజలకు ఆరోగ్యం శ్రీ కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని కూడా అన్నారు. ఆయన చేసిన సేవలు మరవబోమని రైతు బంధువుడు, పేదల ఆరోగ్యం ప్రదాత, అదేవిధంగా పేద విద్యార్థుల విద్య, వైద్యం అందించిన ప్రదత అని అన్నారు . అంతేకాకుండా తెలుగు వారి గుండెల్లో చిరకాలం చెరగని చిరునవ్వుల మరుపురాని మహానేతగా పేరుపొందారు అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నౌషా నాయక్ ,గౌస్ సెట్, సీమ గంగారం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ , నాగరాజ్ .చింతల్ హనుమాన్లు. బండు పటేల్. ఉత్తం. ఖలీల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..