Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న నవచైతన్యయూత్ ఆద్వర్యంలో మంగళవారం రోజునా అన్నదానకార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ముందు గా భక్తులు వినాయకుణ్ణి దగ్గరికి వెళ్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు పోతుకూరి మహేష్ మాటడుతూ ప్రతిసంవత్సరం మేము వినాయకుణ్ణి ప్రతిమను ప్రతిష్టించుకొన్ని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మంచిగా వర్షాలు పడాలని,పంటలు సంవృద్ధిగా పండాలని, పిల్లపాపలతోఅందరూ ఆరోగ్యం గాఉండాలనీ కోరుకొంటామని అన్నారు.ఉపాధ్యక్షుడుమారు మహిపాల్, సభ్యులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.