Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల పట్టణ కేంద్రములో కూరకుల ముదిరాజ్ సంఘముకు ఎస్డీఎఫ్ క్రింద 3 లక్షల నిధులు మంజూరి కావడంతో మంగళవారం రోజునా సంఘ పెద్ద మనిషి కూరాకుల భూమేష్ భూమిపూజ నిర్వహించారు. ఇట్టి నిధులను ఇప్పించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు సంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ ఇంకా నిధులు రాని 15 కుల సంఘాలకు నిధులు ఇప్పించాలని అంచనా వేసి కాంగ్రెస్ ఇంచార్జ్ సునీలన్న దృష్టికి తీసుకువెళ్లితే ప్రభుత్వానికి పంపటం జరిగింది, అవి కూడా త్వరలో మంజూరు అయ్యే విధముగా కృషి చేస్తానని సునీలన్న అన్నారని శివకుమార్ తెలపారు. గ్రామములో ప్రతి ఒక్కరూ ఓపిక పడితే అన్ని సంఘాలకు వరుస ప్రకారం వచ్చే విధముగా ప్రయత్నం చేస్తామని దానికి మిగత సంఘాలు సహకరించాలని శివకుమార్ అన్నారు. ఇట్టి కార్యక్రమములో ఏర్గట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కూరాకుల ముదిరాజ్ సంఘ సభ్యులు అత్యధికముగా పాల్గొన్నారు .