
జనం న్యూస్ సెప్టెంబర్ 02:
నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలంలోనిగుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన జంగం రాజ శేఖర్ (వయసు 28), 2019 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఒక యువతిని మోసపూరిత వాగ్దానాలతో పెళ్లి చేసుకుంటానని తప్పుదారి పట్టించి, అత్యాచారం చేసిన కేసులోఅతని పై చీటింగ్ మరియు అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండు కు తరలించారు.ఈ కేసు విచారణ అనంతరం, న్యాయస్థానం నేడు (02.09.2025) తీర్పు వెలువరించింది. గౌరవనీయులైన ప్రత్యేక ఉమెన్ మరియు 4వ అదనపు మెజిస్ట్రేట్ నిజామాబాద్ గారు జంగం రాజశేఖర్ అనే వ్యక్తిని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి తీర్పును ప్రకటించారు .బాధితుల పరిహార పథకాల కింద అత్యాచార బాధితురాలికి పరిహారం మొత్తము ఐదు లక్షలు కోర్టు ద్వారా ఇవ్వనైనది ఇట్టి కేసులో అద్భుతమైన పనితీరు కనబరిచిన పి .సత్యనారాయణ సి ఐ భీంగల్, పడాలరాజేశ్వర్ ఎస్సైఏర్గట్లకోర్టు కానిస్టేబుల్ తిరుమలేశును జిల్లా కమిషనర్ నిజామాబాద్ గారు అభినందించారు.ఈ కేసులో న్యాయనిర్ణయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, న్యాయవాదులు మరియు సాక్ష్యాధారాలను సమర్పించిన సంబంధిత అధికారులను న్యాయస్థానం అభినందించింది.