

ఘన నివాళులర్పించిన వైయస్సార్ అభిమానులు
జనం న్యూస్- సెప్టెంబర్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అభిమానులు ఘన నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేసి అభివృద్ధి పథకాలకు నాంది పలికిన వైయస్సార్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని, రైతులకు అండగా ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన అందించిన పథకాలు రైతులకు అండగా ఉచిత విద్యుత్, పంటల రుణమాఫీ, జలయజ్ఞం ద్వారా నీటిపారుదల అభివృద్ధి, ఫీజు రీయంబర్స్మెంట్, వైద్యం, ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్ లు, మహిళా సంక్షేమ పథకాలు, పరిశ్రమల అభివృద్ధికి పునాది తో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్ము పుల్లారావు, ఎర్రబోయిన సురేష్, విజయ్, బద్రి,రమావత్ బాలాజీ నాయక్, పిల్లి పాక రమణ, శివ నాయక్, ఎర్రబోయిన రాజు, సపావత్ కార్తీక్, రాయపూడి విజయ్, సత్యాల వెంకటేష్, కారంపూడి శివ తదితరులు పాల్గొన్నారు.