

జనం న్యూస్: జనవరి 24 మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కాంగ్రెస్ తోనే సబ్బండా వర్గాలకు మేలు
రైతులా ఖాతాల్లో ఇందిరమ్మ రైతు భరోస. ఆనందం లో అన్న దాతలు
ముఖ్యమంత్రి, మంత్రులకు పాలాభిషేకలు
మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్
ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల ఖాతాల్లో ఇందిరమ్మ రైతు భరోసా డబ్బులు జమచేసినందుకు కృతజ్ఞతగా మండలం అధ్యక్షులు మీసం మహేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, రైతుల తో కలిసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,వ్యసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి జిల్లా పెద్దలు మంత్రి దామోదర్ రాజనార్సింహా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గార్ల చిత్రపటలకు పాలాభిషేకం చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సబ్బండా వర్గాలకు మేలు జరుగుతుందన్నారు అంతే కాకుండా ప్రజా పాలన లో భాగంగా అమలవుతున్నటువంటి ఆరు గ్యారంటీ లు గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా అనర్హులకు బడా బాబులకు కాకుండా నిజమైన అర్హులందరికి అందేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణ బద్దులై పని చేయాలనీ పిలుపునిచ్చారన్నారు ఈ కార్యక్రమం లో మండల పార్టీ ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, సెక్రటరీ కోరిమి రాజు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ పొన్నాల రాజేష్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకాల భూపతి రెడ్డి, వికలాంగుల విభాగాం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల రాజు, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు ఉడుత జయంత్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి యూసఫ్,ఫిషర్మెన్ జిల్లా సెక్రటరీ గుండు వెంకట్ ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రాజు, పుచ్చాకాయల వెంకట్ రెడ్డి, బర్ల స్వామి zగుడిమల్ల మల్లేశం నాయకులు భాస్కర్, మల్కా మహేందర్,కోలన్ గణేష్,వాసరి మల్లేశం,కుమార్,మంద శ్రీకాంత్, మందల తిరుపతి రెడ్డి, రాజు, మహిళా నాయకురాలు సింగిరాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు