

జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం కేశనకుర్రు పేర్రాజు చెరువు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో 18వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గణపతి మండపం వద్ద ఏకాహ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ శ్రీ గాదిరాజు విశ్వనాథరాజు పాల్గొని తన గానామృతంతో భక్తులను మైమరిపింపజేసినారు ఈ కార్యక్రమంలో హార్మోనిస్ట్ యల్లమెల్లి సత్తిబాబు వారి భజన బృందం పాల్గొని గానామృతంతో భక్తులను ఆనందింప చేసినారు ధర్మ ప్రచారక్ పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన లోక కళ్యాణం జరిగి సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు భజన వలన మానసిక ప్రశాంతత కలిగి భగవంతుని వైపు మనసు మరల తుంది అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు గ్రామస్తులు మాతృమూర్తులు పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో భజనను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రేపు ఉదయం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
