

జనం న్యూస్,సెప్టెంబర్02,
అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలమంచిలి,అచ్యుతాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రోట్లు, పళ్ళు, పాలు పంపిణీ చేశారు. అలాగే కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్ లో మరియు వెంకటాపురం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు నడుమ ఎమ్మెల్యే విజయ్ కుమార్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు,కార్యకర్తలు, విద్యార్థులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
