

జనం న్యూస్ సెప్టెంబర్ 2 నడిగూడెం
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేపూరి సుధీర్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పందిరి వెంకటరెడ్డిలు అన్నారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దున్నా శ్రీనివాస్,గడ్డం మల్లేష్ యాదవ్, బాణాల నాగరాజు,పాతకోట్ల నాగేశ్వరరావు, పసుపులేటి వినయ్ వర్ధన్ బాబు తదితరులు పాల్గొన్నారు.