

సుందరీకరణ పనులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హెచ్ఎండిఏ అధికారులు.
ఏడాదిలోపు పనులు పూర్తిచేయాలని నిర్ణయం.
మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన: నిర్మల జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్.
జనం న్యూస్ సెప్టెంబర్ 2
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరి కరణ పనులను 500 కోట్లతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ ఛాంబర్ లో టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, లతో కలిసి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులపై హెచ్ఎండిఏ, మున్సిపల్ నీటిపారుదల శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ సాగర్ చెరువులో చేపట్టబోయే సుందరీకరణ పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హెచ్ఎండిఏ అధికారులు ప్రదర్శించారు. రూ 500 కోట్లతో మెహబూబ్ సాగర్ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కలెక్టర్ కు హెచ్ఎండి అధికారులు వివరించారు. సుందరీకరణలో భాగంగా మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్ చెరువులోకి కలవకుండా రానున్న 25 సంవత్సరాలకు సరిపోయేలా 23.5 ఏం ఎల్.డి ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా డిజైన్ సిద్ధం చేసినట్లు కలెక్టర్ కు హెచ్ఎండి అధికారులు వివరించారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు .మహబూబ్ సాగర్ చెరువు నీటి నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు .మహబూబ్ సాగర్ చెరువును టూరిజం, రిక్రియేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నారు. హైవే నుండి ఐఐటి పక్కనుండి మహబూబ్ సాగర్ చెరువు వరకు 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ కు నిర్మలా జగ్గారెడ్డి వివరించారు. ప్రాజెక్టు రెండో దశలో 265 కోట్లతో డిసిల్టింగ్ చేసేలా ప్రణాళిక ఉందని హెచ్ఎండి అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వరాలయం ను అభివృద్ధి చేయనున్నట్లు మెహబూబ్ సాగర్ కట్ట వెడల్పు సైక్లింగ్ ట్రాక్ రెండు లైన్ల బిటి రోడ్డు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో రూ.20 కోట్లతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు కట్ట నుండి విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు చెరువు మధ్యలో వాచ్ టవర్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ సాగర్ చెరువు సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సుందరీకరణలో భాగంగా రెండో దశ పనులలో చెరువులో ఐలాండ్ లు, వాటర్ థీమ్ పార్క్, బోటింగ్ డెక్ ల ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. రూ.9 కోట్ల తో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్టులు రూపకల్పన చేసినట్టు అధికారులు వివరించారు. వికలాంగులు వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.త్వరలో ముఖ్యమంత్రితో మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన: నిర్మల జగ్గారెడ్డి, టీ జి ఐ సి చైర్మన్.రూ .500 కోట్లతో చేపట్టబోయే మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ — మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా కట్టపై తిరుగుతూ కలెక్టర్ కు గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను జగ్గారెడ్డి వివరించారు గతంలో నిధులు లేకుంటే తన సొంత నిధులు 50 లక్షల రూపాయలతో మున్సిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్కు జగ్గారెడ్డి వివరించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ,
ప్రజాప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు