

జనం న్యూస్.సెప్టెంబర్ 2. సంగారెడ్డి జిల్లా.హత్నూర
రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిఆర్ ఎస్ నాయకులు అమ్రాది జగదీష్ అన్నారు.మంగళ వారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత ఏడాది సరైన వానలు కురవక పంటలు సాగు చేయలేని రైతులు ఈ సరైన పంటలు పండించుకుందామనె ఆశతో నాట్లు వేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా రైతన్నల గోసను అర్థం చేసుకొని సకాలంలో యూరియా సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతుకు ఒక బస్తా కాకుండా వారికి సరిపడే విధంగా యూరియా బస్తాలు పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.