

భీమిలి నియోజకవర్గంలో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను గారు మరియు మన సిరమ్మ ఘన నివాళి
జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఈరోజు సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత..మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు మరియు తన కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర(సిరమ్మ) భీమిలి నియోజకవర్గంలో టి.నగర్ పాలెం,మధురవాడ వద్ద ఉన్న వైస్సార్ విగ్రహాలకి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో..భీమిలి నియోజవర్గ ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు , చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.