

జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం నుంచి విశాఖ వెళ్లే దారిలో జొన్నాడ వద్ద ఉన్న టోల్ గేట్ యాజమాన్యం నిబంధనలకి విరుద్ధంగా టోల్ ఫీజు వసూలు చేస్తోందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోందని చర్యలు తీసుకోవాలని కోరారు.