

జనం న్యూస్ 03 సెప్టెంబర్( భద్రాద్రి కొత్తగూడెం )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ ఆఫీస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల తరపున ధర్నా చేపట్టారు. మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సత్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ, “రైతులకు అత్యవసరంగా అవసరమైన యూరియా ఎరువులు అందక పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు. కేవలం హామీలతో మోసం చేస్తూ, ఎరువుల కొరతపై చర్యలు తీసుకోవడంలో విఫలమైంది” అని తీవ్రంగా విమర్శించారు.“రైతు సమాజం కోసం ఎరువుల సరఫరా తక్షణమే ప్రారంభించకపోతే, బీఆర్ఎస్ మరింత తీవ్ర ఆందోళనకు దిగుతుంది” అని హెచ్చరించారు.ధర్నాలో పాల్గొన్న రైతులు కూడా ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ, వెంటనే యూరియా సరఫరా చేసి రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు