

జనం న్యూస్ సెప్టెంబర్ 02 కోటబొమ్మాలి మండలం:కొత్తమ్మతల్లి దేవస్థానంలో దేవస్థానం ర్యనిర్వాహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కోటబొమ్మాలి గ్రామం లో వేంచేసియున్న శ్రీ కొత్తమ్మవారి జాతర ఉత్సవాలు తే.23-9-2025ది. మంగళవారం నుండి తే.25-9-2025ది. గురువారం వరకు అత్యంత వైభవముగా నిర్వహించబడును. సదరు జాతర సందర్భముగా 3 దినములు (1). రాజగోపురం నుండి దేవాలయం ప్రాంగణం మొత్తం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగు స్టేజీ వద్ద లైటింగ్, 3 జనరేటర్లు సప్లయి చెయ్యుటకు, స్టేజీ వద్ద గ్రామం అంతా సౌండ్ సిస్టం ఏర్పాటు చెయ్యుటకు, (2) మెయిన్ రోడ్ మొత్తం అనగా సుమారు 2 కి. మీ. పొడవునా మరియు గ్రామం మొత్తం ప్రదాన వీదులలో యల్.ఈ.డి బల్బ్ లతో సీలింగ్ వేయుటకు, (3) 6 పెద్ద గేట్లు పెట్టుటకు, మరియు ఇతర వగైరా ఏర్పాట్లు చెయ్యుటకు కొటేషన్లు సమర్పించవలసినదిగా కోరుచున్నాను. ఆశక్తి కలవారు కార్యాలయము పనిచేయు వేళలలో సదరు కొటేషన్లు సమర్పించవలసినదిగా కార్యనిర్వాహణాధికారి కోరుచున్నారు