Listen to this article

మొదటి విడత శిక్షణలో ఉత్తీర్ణులైన లైసెన్స్ సర్వేయర్లకు సర్టిఫికెట్ లు అందజేత

జనం న్యూస్ సెప్టెంబర్ 03 సంగారెడ్డి జిల్లా

తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ సంస్కరణలలో భాగంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సర్వేయర్లకు సంబంధించిన స్థానం కల్పించిందని జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఏ. ఐనేష్ అన్నారు. బుధవారం జిల్లా కార్యాలయంలో మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఉత్తీర్ణులైన లైసెన్స్ సర్వేయర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేయర్లకు పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వడం జరుగుతుందని మొదటి విడత ఉత్తీర్ణులైన సర్వేర్లు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . భూములకు సంబంధించి క్రయ విక్రయాలు జరిగిన లేదా ఇతర ఎలాంటి లావాదేవీలు జరిగిన సంబంధిత భూములకు సంబంధించి సర్వే, సర్వే మ్యాప్ లను ఆధారంగా చేసుకుని ఇక మీదట భూభారతి చట్టంలో జరిగేలా ప్రభుత్వం నూతన చట్టం తీసుకువచ్చింది అన్నారు. దీంతో సర్వేయర్లకు, లైసెన్స్ సర్వేయర్లకు అనేక అవకాశాలు ఏర్పడతాయన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాలను లైసెన్సుడ్ సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తప్పులకు అవకాశం లేకుండా భూములకు సంబంధించిన కొలతలు మ్యాపులను రైతులకు అందించాలని సూచించారు. శిక్షణలో ఉత్తీర్ణులు కానీ సర్వేయర్లకు ఈనెల 13 ,14 తేదీలలో మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి ఏ. ఐనేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్లు ఎం రాజు, శ్రీనివాస్, బిక్షపతి, రుహుల్ల, కార్యాలయ సూపరిండెంట్ ఇందిరా ట్రైనింగ్ సర్వేయర్లు పాల్గొన్నారు.