Listen to this article

జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

గిన్నిస్ బుక్ లో చోటు కోసం ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మీద యాత్ర చేస్తూ  బుధవారం నాగార్జునసాగర్  చేరు కున్నారు కర్ణాటకలోని బెంగళూర్ కు చెందిన దివాకర్ రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేం ద్రపాలిత ప్రాంతాలు సుమారు 806 జిల్లాల మీదుగా రెండేళ్ల పాటు రెండు లక్షల కిలోమీటర్ల యాత్రకు సిద్దపడ్డాడు.
2023, నవంబర్ 1న బెంగుళూర్ లో ప్రారంభమైన  తన యాత్ర ఉత్తర భారతంలో పూర్తిగా దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాలను 675 రోజుల్లో 18 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 89 వేల కిలోమీటర్లు ప్రయాణించి  బుధవారం ఉదయం  నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీకి
చేరుకున్నారు.ఒకే దేశంలో అత్యధిక దూరం ప్రయాణించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించి గిన్నిస్ రికార్డు పొందాలన్నది తన ఆశయంగా చెప్పుకొచ్చారు.