Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో ఈ రోజు (30/8/25) గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపుర గ్రామం నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజక్ట్ ఇంటెన్సీఫైడ్ ఐ ఈ సి క్యాంపెయిన్ 2025 ద్వార గ్రామస్తులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా గా ఉండాలి అని హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కలిగించారు అనంతరం కరపత్రాలు మరియు పోస్టర్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ బి మౌనిక, అంగన్వాడీ కార్యకర్తలు వెంకటేశ్వ్రమ్మ సరస్వతీ ఆశ కార్య కర్తలు సరిత వెంకాయమ్మ లింక్ వర్కర్ మేమున్నిస్ పాల్గొని నిర్వహించారు