Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువులో బుధవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి మునగాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈత కోసం వెళ్లి మృతి చెందాడా?లేక ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.