Listen to this article

జనం న్యూస్ : 3 ఆగస్టు బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట:

సిద్దిపేట కు చెందిన ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు వై.రమేష్ కు ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఇటీవల గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.ఈ కార్యక్రమం సురవరం ప్రతాపరెడ్డి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్ లో జరిగింది. ఈ స్ఫూర్తి అకాడమీ ఫౌండర్ & చైర్మన్ లయన్ డా. ఆకులు రమేష్, ఏషియన్ వేదిక్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఫిరోజ్ థామస్, ఫిలిం యాక్టర్ డా. ఘర్షణ శ్రీనివాస్, ఫిలిం ప్రొడ్యూసర్, యాంకర్ భారత్ సేవ, ఇండియా మూవీ డైరెక్టర్ డా. మల్లం రమేష్, డా. గూడూరి చెన్నారెడ్డి, సుదర్శన్ గౌడ్, అశోక్ తదితర ప్రముఖుల సమక్షంలో గౌరవ డాక్టరేట్ ను వై.రమేష్ కు అందజేశారు..వై.రమేష్ గత 2 దశాబ్దాలుగా తన కళా ప్రదర్శనల ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ విశేష సేవలు అందిస్తున్నారు.సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అంబాసిడర్‌గా వ్యవహరించి, తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం, పోలియో చుక్కలు, ఆశ కార్యక్రమం, పౌష్టికాహారం, జనమరణాలు నమోదు, ఎయిడ్స్ అవగాహన, ఆడపిల్లల చదువు పైన కార్యక్రమాలు వంటి సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించారు..అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోనూ తన మిమిక్రీ, మ్యాజిక్ ప్రదర్శనల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో కలిగించి, విద్యార్థులు–యువతలో ఉత్సాహాన్ని నింపారు..యువతకు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంపై పలు ప్రదర్శనలు ఇచ్చారు..
పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు – అవగాహన కార్యక్రమాల్లో కూడా తన మిమిక్రీ–మ్యాజిక్ ద్వారా చైతన్యం కలిగించారు.అలాగే మూఢనమ్మకాల నిర్మూలన కోసం తన మ్యాజిక్ ప్రదర్శనలను వినియోగించి, ప్రజల్లో విజ్ఞాన దృష్టి, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ గౌరవం తనకే కాకుండా కళారంగానికి, తెలంగాణ ఉద్యమం, యువత అభివృద్ధి, పోలీస్ అవగాహన కార్యక్రమాలు, మూఢనమ్మకాల నిర్మూలనలో చేసిన కృషికి లభించిన గుర్తింపని, తన పైన మరింతగా సామాజిక భాద్యత పెరిగిందని వై.రమేష్ పేర్కొన్నారు. ఇన్నాళ్ళ ప్రయాణంలో సహకరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం సార్ గారికి, ఓంకార్, సత్యం సార్ గారికి, గారికి, మిత్రులు నాగరాజు, వేణుగోపాల్,ఉమాపతి , స్నేహితులకు,కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికీ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.