Listen to this article

జనం న్యూస్ :3 ఆగస్టు బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :

భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రథమ మహాసభలను గత నెల 30,31 తేదీలలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది . ఈ మహాసభలలో యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా సిద్దిపేట రూరల్ మండలం లోని చింతమడక గ్రామానికి చెందిన కరోల్ల నవీన్ మరియు గజ్వేల్ మండల షేర్ పల్లి గ్రామానికి చెందిన వేముల ప్రవీణ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కేంద్రానికి మరియు మాజీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి చంద్లాపురం మధు గారికి, నూతన సిద్దిపేట జిల్లా యూఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే సహచర ఉద్యమ మిత్రులకు విప్లవ అభివందనాలు తెలియజేశారు. జిల్లా మహాసభలలో చేసిన తీర్మానాలకు అనుగుణంగా భవిష్యత్తులో బలమైన పోరాటాలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ మరియు గురుకుల విద్యార్థుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, కావున వారి యొక్క సమస్యలను అధ్యయనం చేయడానికి మరికొద్ది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్ యాత్ర నిర్వహిస్తామని అన్నారు.సిద్దిపేట జిల్లాలో యూఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.