Listen to this article


జనం న్యూస్ సెప్టెంబర్ 03: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలము:గణేష్ ఉత్సవాల నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఏర్గట్ల ఎస్.ఐ పడాల రాజేశ్వర్ తెలిపారు.అవసరానికి మించి డీజే సౌండ్ వినిపించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, అల్లర్లు సృష్టించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. అలాగే గణేష్ మండలి నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా , మద్యపానం సేవించకుండాజరుపుకోవాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే డీజే నిర్వాహకులు మీద ,గణేష్ మండలినిర్వహకుల మీద చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.