Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 4

తర్లపాడు మండల వ్యవసాయ అధికారి పి. జోష్ణదేవి.ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం కొండారెడ్డిపల్లి మరియు లక్ష్మక్క పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి ఖరీఫ్ 2025 సంవత్సరానికి సాగు చేసిన పంటలను లేదా సాగు చేయని
బీడు భూములను తప్పనిసరిగా రైతులందరూ ఈ కాపు నమోదు లోనికి తీసుకురావాలని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ పంట నమోదుకు రైతులందరూ సహకరించాలని కోరారు. వ్యవసాయ శాఖ నందు పథకాలకు అర్హులు అవ్వాలంటే తప్పనిసరిగా ఈక్రాపు నమోదులో ప్రతి ఒక్క రైతు ఉండవలెను తెలియజేశారు. సెప్టెంబర్ 30వ తారీకు ఆఖరి తేదీ గనుక రైతులు ఈ క్రాప్ నమోదు పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. రీసర్వే గ్రామాల్లో జాయింట్ ఎల్ పి ఎస్ ఉన్న రైతులు తమ విఆర్ఓ ని సంప్రదించి వారి భూములను విభజించుకోవాలని తెలియజేశారు. ఈక్రాప్ నమోదు లో ఉన్న రైతులకి వారి సాగుచేసిన పంటను బట్టి విస్తీర్ణం బట్టి రైతు సేవ కేంద్రం నుండి ఎరువులు ఇవ్వబడునని తెలిపారు. కలుజువ్వలపాడు వెటర్నరీ డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ పెయ్య దూడలు జన్మించడం కోసం గవర్నమెంట్ వారు 150 రూపాయలకే సెక్స్ సార్టెడ్ సెమెన్ ( ఎస్ ఎస్ ఎస్) అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. కావున పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె సూచించారు. అనంతరం రైతులు సాగు చేసిన వరి నారుమళ్ళను పరిశీలించి ఇనుప దాతు లోపాలను సవరించడం కోసం అన్నబేధి, నిమ్మవుప్పు కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఏ సుస్మిత కొండారెడ్డిపల్లి లక్ష్మక్క పల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.