Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ

ఐ.పోలవరం మండలం,గుత్తెనదీవి ,సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో 2025 ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ,భవిష్యత్తు తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దే అరుదైన గౌరవం గురువులకే దక్కుతుందని ఆమె అన్నారు. స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు ఉపాధ్యాయులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన .గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఈ ప్రపంచంలో గురువే సమస్తం .విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చిన రుణం తీర్చుకోలేం. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలు అధిరోహించడమే అసలైన గురుదక్షిణ. పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు దేనని తెలిపాయి .గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకుంటుంది అన్నారు పెద్దలు . ఈ సందర్భంగా బొమిడి నాగేంద్ర వర్మ మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లి ని ఆదర్శంగా తీసుకుని బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, కరస్పాండెంట్ శ్రీనివాసరావు ,నాటి ధనరాజు, బొమిడి నాగేంద్ర వర్మ ,గెల్లా భూలక్ష్మి, నల్లా దేవకి, కొంకి నాగజ్యోతి , దేవరపల్లి దుర్గా, పోతుల లతా మంగేష్కర్, దుగ్గుదుర్తి వీరలక్ష్మి, గంజా లోవలక్ష్మి, ఏ. ప్రత్యూష , ఏ.శిరీష, వోలేటి అమ్మాజీ, కట్టుంగి నాగ దివ్య, నల్లా విజయ దుర్గ,జగతా రత్నమాలతి, డి .శ్రీ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.